JCB Falls From 300 Meters Height | అదుపు తప్పి లోయలో పడిపోయిన JCB
శ్రీశైలం ఆలయంలోని స్వామివారి హుండిలో నగదు చోరికి పాల్పడి పారిపోయిన విద్యాసాగర్ ను శ్రీశైలం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు విద్యాసాగర్ నుంచి 1,24,200 రూపాయల నగదును స్వాదీనం చేసుకుని సీజ్ చేశామని సిఐ ప్రసాదరావు వెల్లడించారు. రాత్రి సమయంలో ఆలయ అట్టెండిగా ఉంటూ గత 90 రోజులుగా ఆలయంలోని హుండిలో 12 సార్లు చోరికి పాల్పడ్డాడు విద్యాసాగర్. చోరికి పాల్పడినట్లు సిసి కెమెరాలలో గుర్తించినట్లు సిఐ ప్రసాదరావు వెల్లడించారు. మొత్తం 3,79,200 రూపాయలు నగదు చోరి చేశాడని విచారణలో తెలిందన్నారు. గత నెల 16 వ తేదిన శ్రీశైలంలోని స్వామివారి గర్బలయంలోని హూండిలో విద్యాదర్ చోరికి పాల్పడినట్లు సిసి పూటేజి ఆదారంగా దేవాలయం అధికారుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసారు. మరోవైపు ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలోని హెలాంగ్ ఆనకట్ట వద్ద విరిగిపడ్డ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు ఒక్కసారిగా భయాందోనళకు గురైయ్యారు. శిథిలాలు పడడం గమనించిన కార్మికులు అక్కడ నుంచి పరుగులు తీశారు. ఈ సంఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.