Jagityal Crop Loss: జగిత్యాలలో భారీ వర్షాలకు పంటనష్టం...ఆందోళనలో రైతులు
జగిత్యాల జిల్లాలో రెండురోజులగా కురుస్తున్న భారీ వర్షాలకు రైతన్నలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల తో పాటు రాయికల్ సారంగాపూర్ ,మెట్ పల్లి, కోరుట్ల తో పాటు పలు మండలాల్లో భారీ వర్షం పడడంతో వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలమట్టమైంది. పూతకు వచ్చిన మామిడి రాలి పోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయమని తేల్చడంతో ఆందోళన చెందుతున్న రైతులకు అకాల వర్షం పడడంతో రైతులకు కన్నీరే మిగిలిస్తుంది.. రైతులకు రాష్ట్రప్రభుత్వం బీమా సౌకర్యం కల్పించాలని పలువురు రైతులు కోరుతున్నారు.