బంకర్‌లో దర్జాగా బతికిన సిన్వర్, వీడియో విడుదల చేసిన ఇజ్రాయేల్

Continues below advertisement

హమాస్ చీఫ్ సిన్వర్ బతికినంత కాలం ఎక్కడో అక్కడ కలుగులో ఎలుకలాగానే బతికాడు. సొరంగంలో తన ఫ్యామిలీని తీసుకెళ్లి అక్కడే మకాం పెట్టాడు. టన్నెల్‌లో అంటే చాలా చీకటిగా ఉంటుందని, గాలి కూడా ఆడదని అనుకుంటాం. అసలు అక్కడ ఎలా ఉంటారో అని కూడా ఆశ్చర్యపోతాం. కానీ...సిన్వర్ మాత్రం ఈ సొరంగంలోనే చాలా దర్జాగా బతికాడు. ఓ విల్లాలో ఉన్నన్ని వసతులు ఏర్పాటు చేసుకుని బతికినంత కాలం రాయల్‌గా ఉన్నాడు. లోపలి ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో చూస్తే మన కళ్లు తిరిగిపోతాయ్. ఇజ్రాయేల్ డిప్లొమాట్ ఒకరు బంకర్‌లో ఉన్న సిన్వర్ ఇంటి వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. బెడ్‌రూమ్‌లు, కిచెన్, స్టోరేజ్ రూమ్‌లు, ఫ్రిడ్జ్..ఇలా అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. 

అంతే కాదు. బాత్‌రూమ్‌లనీ చాలా విలాసవంతంగా కట్టించుకున్నాడు. లోపల ఓ ప్రైవేట్ షవర్ బాత్ కూడా ఉంది. బస్తాల కొద్ది సరుకులు తెచ్చి పెట్టుకున్నాడు. లక్షలు విలువ చేసే ఇజ్రాయేల్ కరెన్సీ కూడా గుర్తించింది ఆర్మీ. అక్కడే ఓ టేబుల్‌పైన కాస్ట్‌లీ పర్‌ఫ్యూమ్  బాటిల్స్ ఉన్నాయి. బంకర్‌ పక్కనే ఓ పెద్ద గది ఉంది. అందులో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు నిల్వ చేశాడు సిన్వర్. ఇజ్రాయేల్ సైన్యం వెతుకుతోందన్న విషయం తెలిసి...బంకర్‌లో నుంచి బయటకు వచ్చి వేరే చోటకి వెళ్లిపోయాడు. అటూ ఇటూ తిరిగి చివరకు రఫాలో ఆర్మీ చేతికి చిక్కి చనిపోయాడు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram