హెజ్బుల్లా రహస్య సొరంగం వీడియో షేర్ చేసిన ఇజ్రాయేల్

Continues below advertisement

ఇజ్రాయేల్ మిలిటరీ ఓ సంచలన వీడియో విడుదల చేసింది. కొద్ది రోజులుగా లెబనాన్‌లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలోనే లెబనాన్‌లో ఓ టన్నెల్‌ని గుర్తించింది. హెజ్బుల్లా సభ్యులు ఇక్కడి నుంచే ఆపరేట్ చేసినట్టు వెల్లడించింది. దాదాపు నిముషం పాటు ఉన్న ఈ వీడియోలో టన్నెల్‌ మొత్తం షూట్ చేసింది ఓ లేడీ కమాండర్.  100 మీటర్ల పొడవున్న ఈ సొరంగ మార్గంలో ఐరన్ డోర్స్ ఉన్నాయి. వీటితో పాటు గదులు, AK 47 రైఫిల్స్, బాత్‌రూమ్, బెడ్ రూమ్, జనరేటర్ల కోసం ప్రత్యేకంగా స్టోరేజ్ రూమ్స్..వాటర్ ట్యాంక్‌లు..ఇలా అన్ని సౌకర్యాలున్నాయి. అయితే...లెబనాన్‌లో ఎక్కడ ఈ టన్నెల్ ఉందన్నది ఇజ్రాయేల్ డిఫెన్స్ వెల్లడించలేదు. గతేడాది అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయేల్‌పై దాడి చేసింది. అప్పటి నుంచి ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఆ తరవాత హెజ్బుల్లా కూడా ఇజ్రాయేల్‌పై దాడులు మొదలు పెట్టింది. ఫలితంగా..అటు హమాస్‌తో ఇటు హెజ్బుల్లాతో ఒకేసారి యుద్ధం చేస్తోంది ఇజ్రాయేల్. సౌత్ లెబనాన్‌ బార్డర్ దాటుతుండగా ఈ టన్నెల్ కనిపించినట్టు సైన్యం వెల్లడించింది. గాజాలో హమాస్‌ టన్నెల్స్ లాగే ఇవీ ఉన్నాయని, ఇక్కడే స్థావరాలు ఏర్పాటు చేసుకుని దాడులు చేస్తున్నారని వివరించింది. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram