లెబనాన్‌లోని బీరట్‌ సిటీపై దాడులు చేసిన ఇజ్రాయేల్

లెబనాన్‌పై యుద్ధం కొనసాగిస్తున్న ఇజ్రాయేల్ ఇటీవలే బీరట్‌పై దాడులు చేసింది. గగనతలం నుంచి బాంబుల వర్షం కురిపించింది. హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడింది. ఈ క్రమంలోనే ఆ ప్రాంతమంతా పొగ కమ్ముకుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ దాడులకు సంబంధించిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ దాడులు చేసిన సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దాలు వినిపించాయి. ఇకపైనా ఇదే స్థాయిలో దాడులు కొనసాగుతాయని ఇజ్రాయేల్ తేల్చి చెప్పింది. ఇప్పటి వరకూ ఇజ్రాయేల్ దాడుల కారణంగా లెబనాన్‌లో కనీసం వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయినట్టు అంచనా. అయితే...వీళ్లలో ఎక్కువగా హెజ్బుల్లా ఉగ్రవాదులే ఉన్నట్టు తెలుస్తోంది. అటు లెబనాన్ కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయేల్‌పై అటాక్ చేస్తోంది. నార్త్ ఇజ్రాయేల్‌లో ఇటీవల జరిగిన దాడిలో ఏడుగురు మృతి చెందారు. అటు హమాస్‌తోనూ ఇదే విధంగా యుద్ధం చేస్తోంది ఇజ్రాయేల్. గాజాపై అటాక్ చేసింది. హమాస్ స్థావరాలను టార్గెట్‌గా పెట్టుకుని గగనతలం నుంచి దాడులు కొనసాగిస్తోంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola