ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్
మిడిల్ ఈస్ట్‌లో మరోసారి అలజడి మొదలైంది. ఇజ్రాయేల్‌పై ఇరాన్ ఊహించని స్థాయిలో దాడులు చేసింది. ఏకంగా 400 మిజైల్స్‌తో విరుచుకుపడింది. ఈ అటాక్‌తో ఒక్కసారిగా ఇజ్రాయేల్ ఉలిక్కిపడింది. దేశమంతా సైరన్‌లు మోగించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అలెర్ట్ జారీ చేసింది. ఈ దాడులు చేసిన వెంటనే ఇరాన్ ఓ ప్రకటన చేసింది. హమాస్ కీలక నేత ఇస్మాయేల్ హనియేని హతమార్చినందుకు.. ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నామని తేల్చి చెప్పింది. ఇజ్రాయేల్ ఉగ్ర చర్యలకు..ఇదే సరైన సమాధానమని స్పష్టం చేసింది. ఈ దాడులపై ఇజ్రాయేల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా స్పందించారు. ఇరాన్ చాలా పెద్ద తప్పు చేసిందని, అంతకంత అనుభవిస్తుందని వెల్లడించారు. మిడిల్ ఈస్ట్‌లోని అలజడిపై అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించింది అమెరికా. ఈ విషయంలో ఇజ్రాయేల్‌కి పూర్తి స్థాయిలో అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ఇది ఇజ్రాయేల్, అమెరికా సేనల బలానికి పరీక్ష లాంటిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు వెల్లడించారు.