Youtuber washed away in Waterfalls | జలపాతంలో పడి యూట్యూబర్ గల్లంతు | ABP Desam

సోషల్ మీడియా పిచ్చితో ప్రాణాంతక స్టంట్లు చేస్తూ ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నా.. యువతలో మాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఒడిషాకి చెందిన ఓ యంగ్ యూట్యూబర్ ఈ పిచ్చికి బలయ్యాడు. ఈ మధ్య కురిసిన వర్షాలకి కొరాపుట్ జిల్లాలోని దుడుమా వాటర్‌ఫాల్స్ పొంగిపొర్లుతుండడంతో ఆ అందాలు చూడటానికి చాలామంది టూరిస్టులు అక్కడికి వెళ్తున్నారు. గంజాం జిల్లలోని బెర్హంపూర్‌కి చెందిన 22 ఏళ్ల సాగర్‌ కూడా అక్కడికి తన యూట్యూబ్ కోసం వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఎగువ ఉన్న మచ్చకుంట డ్యాంలో నీరు ఎక్కువగా చేరుకోవడంతో అధికారులు గేట్లు తెరిచి నీటిని కిందికి వదిలారు. ఈ విషయంపై ఆల్రెడీ దిగువ ప్రాంతాలకి హెచ్చరికలు కూడా చేశారు. కానీ ఆ విషయం తెలియని సాగర్.. జలపాతానికి దగ్గరగా నిలబడి డ్రోన్‌తో వీడియోలు చేయడం స్టార్ట్ చేశాడు. అదే సమయంలో ఒక్కసారిగా ప్రవాహం పెరగడంతో సాగర్.. జలపాతం మధ్యలో చిక్కుకుపోయాడు. అతడి చుట్టుపక్కల ఉన్నవాళ్లు కాపాడేలోపే ప్రవాహ వేగానికి కొట్టుకుపోయాడు. ఈ ఘటన మొత్తాన్ని అక్కడున్న వాళ్లు మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. ఇక అప్పటివరకు నవ్వుతూ తమతో తిరిగిన సాగర్.. కళ్ల ముందే కొట్టుకుపోవడంతో అతడి ఫ్రెండ్స్ అందరూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola