Yemen Nimisha Priya Case Explained in Telugu | ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటున్న నిమిష ప్రియ కథ ఏంటీ.?

కేరళ నర్సు నిమిషా ప్రియ ఉరిశిక్షకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. భారత్ ప్రభుత్వం జరుపుతున్న చర్చలు కొలిక్కి వస్తున్నట్లు కనిపిస్తోంది. కేరళ నర్సు నిమిషా ప్రియ మరణశిక్ష అమలును యెమెన్ ప్రభుత్వం తాత్కాలికంగా వాయిదా వేసింది. ఒక నివేదిక ప్రకారం, నిమిషాకు షెడ్యూల్ ప్రకారం విధించనున్న ఉరిశిక్షను ప్రస్తుతం వాయిదా వేశారు.

జూలై 16న యెమెన్ అధికారులు నిమిషా ప్రియకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. ఈ కేసు విషయంలో భారత ప్రభుత్వం రంగంలోకి దిగి కేరళ నర్సు ప్రాణాలు కాపాడేందుకు చర్చలు జరుపుతోంది. దాంతో ప్రాథమికంగా నిమిషా ప్రియ ఉరిశిక్ష వాయిదా వేస్తూ యెమెన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆమె 2017 నుండి యెమెన్ జైలులో ఉన్నారని తెలిసిందే. యెమెన్ కోర్టు నర్సు నిమిషా ప్రియను హత్య కేసులో దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

తమ దేశానికి చెందిన పౌరుడు తలాల్ అబ్దో మహదీని హత్య చేసినట్లు నిమిషా ప్రియపై యెమెన్ లో ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విచారణ పూర్తయి చివరకు ఆమె దోషిగా తేలింది. తన పాస్‌పోర్ట్‌ను తన వద్ద నుంచి తిరిగి తీసుకోవడానికి అబ్దో మహదీకి అనస్థీషియా ఇంజెక్ట్ చేసింది.అయితే అధిక మోతాదులో మందు డోసేజ్ ఇవ్వడం వల్ల అతను మరణించాడని ఆరోపణలున్నాయి. అనస్థీషియా ఇచ్చింది నర్సు నిమిషా ప్రియ కావడంతో ఈ కేసులో ఆమెకు యెమెన్ కోర్టు మరణశిక్ష విధించింది. అయితే, నిమిషా ఉరిశిక్షను అక్కడి ప్రభుత్వం ప్రస్తుతానికి వాయిదా వేసింది.

 

 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola