డ్రగ్స్ ఇచ్చి బాలికలపై లైంగిక దాడి!

పాఠశాలలో పాడు పని.. ఉత్తర్‌ప్రదేశ్ ముజాఫర్ నగర్‌లో దారుణం జరిగింది. 10వ తరగతి బాలికలపై పాఠశాల సిబ్బందే లైంగిక దాడికి పాల్పడ్డారు.ఇంతకంటే దారుణం ఉంటుందా..? చదువు నేర్పాల్సిన పాఠశాలలో అకృత్యమా? అన్యంపున్యం ఎరుగని బాలికలపై అఘాయిత్యమా? డ్రగ్స్ ఇచ్చి మరీ బాలికలపై లైంగిక దాడి..! అవును.. ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది. అసలేం జరిగిందో తెలుసా?నవంబర్ 17న ముజాఫర్‌నగర్‌లోని పుర్కాజీ టౌన్ స్కూల్ సిబ్బంది. జీజీఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద 17 మంది బాలికలను ఇంటికి వెళ్లకుండా ఆపు చేశారు. వీరంతా పదో తరగతి చదువుతున్నారు. సీబీఎస్‌ఈ ప్రాక్టికల్ ఎగ్జామ్ పేరుతో వీరిని ఆ రోజు రాత్రి పాఠశాలలోనే ఉండాలని చెప్పారు. అయితే ఆ సమయంలో ఒక్క మహిళా సిబ్బంది, టీచర్ కూడా లేరు. పక్కా ప్లాన్‌తో బాలికలకు ఇచ్చిన ఆహారంలో డ్రగ్స్ కలిపి తర్వాత వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు సిబ్బంది. ఆ తర్వాతి రోజు ఉదయం బాలికలను ఇంటికి పంపించారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola