Proud India | భారతదేశంపై అమెరికా అక్కసు వెనక కారణం ఇదే | ABP Desam

Continues below advertisement

భారత్‌లో జరిగింది బాంబు పేలుడు కాదు.. జస్ట్ గ్యాస్ సిలిండర్ పేలుడంతే.. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్‌పై పాక్ రక్షణ మంత్రి చేసిన కామెంట్ ఇది. ఇండియాలో ఇంత పెద్ద టెర్రరిస్ట్ ఎటాక్ జరిగి.. 13 మంది వరకు ప్రాణాలు కోల్పోతే.. అమెరికా లాంటి దేశం యాక్సిడెంటల్ బ్లాస్ట్ వల్ల భారత్‌లో జరిగిన దుర్ఘటనకు చింతిస్తున్నాం అన్నదే కానీ.. ఎక్కడా ఉగ్రమూక ఎటాక్ అని మెన్షన్ కూడా చేయలేదు. ఇక మన దేశంలో కొంతమంది నాయకులైతే ఇది అసలు బయటి టెర్రరిస్ట్‌లు చేసిన పని కానే కాదు.. ఇది ఇండియాలో ఉండే వాళ్లే చేసుకున్న ఎటాక్ అంటున్నారు. అంటే ఈ ఎటాక్ చేసింది ఉగ్రవాదులు కాదా? అసలు ఎటాకే జరగలేదా? ఏది నిజం? జరిగిన నష్టం.. పోయిన ప్రాణాలకి బాధ్యత ఎవరిది? బాధ్యత సరే.. కనీసం ఉగ్రదాడి జరిగిందని ఒప్పుకోవడానికి కూడా ప్రపంచ దేశాలకి మనసొప్పడం లేదా? కనీసం మన దేశంలో ఉన్నవాళ్లకి కూడా ఇది భారతదేశంపై జరిగిన దారుణమైన దాడిగా కనిపించడం లేదా? ఏమో.. కానీ.. ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ ఏ దేశంపై దాడి చేయని.. ఏ దేశంపై దురాక్రమణకు ప్రయత్నించని దేశం ఏదైనా ఉందంటే.. అది ఇండియానే. ఇది ప్రపంచం మొత్తం ఒప్పుకునే నిజం. ఇంకా మాట్లాడితే పక్క దేశాల ఆక్రమణలకు గురై ముక్కముక్కలు కావడం తప్పితే.. తన నుంచి ముక్కలైన దేశాల్లో నుంచి కూడా ఎప్పుడూ ఇంచ్ భూమి కూడా ఎప్పుడూ ఆక్రమించుకోవడానికి ట్రై చేయని దేశం కూడా ఇండియానే. దశాబ్దాలుగా భారత్‌లో ఉగ్రదాడులు చేస్తూ.. వందలు, వేల ప్రాణాలు తీస్తూ రాక్షసానందం పొందుతున్న పాకిస్తాన్‌తో కూడా శాంతి చర్చలకు ఎన్నోసార్లు ప్రయత్నించిన దేశం కూడా భారతే. దీన్ని బట్టే ఇండియా ఎంత శాంతియుతమైన దేశమో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అమెరికా, రష్యా బద్ద విరోధులైనా.. ఆ రెండింటితోనూ ఈక్వల్ ఫ్రెండ్‌‌షిప్ చేసే ఏకైక కంట్రీ ఇండియానే. అంటే ఎంత శాంతియుతంగా.. ఎంత సమన్వయంతో ఉంటే ఇలాంటి అద్భుతం సాధ్యమవుతుంది? కానీ.. ఎందుకో.. ఇండియా ఇంత చేసినా.. మన దేశం అంటే ఎప్పుడూ పక్క దేశాలకి చులకనే. ఇంకా మాట్లాడితే అసూయ, ద్వేషం. ఈర్ష్య, కోపం. మనకి లాభం వచ్చిందంటే అసూయ, మనం ఎదుగుతుంటే ద్వేషం. మనం ఏదైనా సాధిస్తే ఈర్ష్య, మనం మనలా బతుకుతామంటే కోపం.. అసలు ఓవరాల్‌గా ఇండియా అంటే భరించలేని కడుపుమంట. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలకి అంతే. అందులోనూ ముఖ్యంగా గుంటనక్క అమెరికాకి ఇండియా ఎదగడం, ఇండియా ఏదైనా సాధించడం.. ఇండియా తనకి నచ్చినట్లు చేస్తా అనడం ఏ మాత్రం నచ్చదు. ఎప్పుడూ తను చెప్పినట్లు.. తన కాలి కింద చెప్పులా పడి ఉండాలనుకుంటుంది. అలా కాదని.. మనం ఏ మాత్రం మన లైఫ్‌లో బతకడానికి, ఎదగడానికి ట్రై చేసినా.. తన గుంటనక్క బుద్ధులన్నీ బయటపెట్టి సర్వనాశనం చేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు కూడా అదే చేస్తోంది. 




Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola