Trump Warning Apple CEO Tim Cook | భారత్ లో కంపెనీ పెట్టొద్దంటున్న ట్రంప్ | ABP Desam

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారత్ టార్గెట్ గా మాట్లాడారు. యాపిల్ సంస్థ భారత్ లో తమ ఐఫోన్ల తయారీని ఇబ్బడి ముబ్బడి గా పెంచేయటాన్ని తప్పు పట్టారు ట్రంప్. యాపిల్ సీఈవో టిమ్ తో కుక్ తో ఈ విషయంపై ఇప్పటికే మాట్లాడానన్న  ట్రంప్ ఇండియాలో గతేడాది 60శాతం తమ ఉత్పత్తులను యాపిల్ పెంచటం తనకు నచ్చలేదన్నారు. టిమ్ కుక్ ఆలోచనలు అమెరికాకు ఉపయోగపడేలా ఉండాలన్న ట్రంప్...భారత్ తన సంగతి తను చూసుకోగలదని చెప్పారు. అంతే కాకుండా భారత్ లో టారిఫ్స్ చాలా ఎక్కువగా ఉంటాయని అమెరికా తన వస్తువులను ఇండియాలో అమ్ముకోవాలంటే చాలా కష్టపడాల్సి వస్తోందని చెప్పారు. కొవిడ్ సంక్షోభం తర్వాత చైనాలో తమ ఉత్పాదనలను తగ్గించిన యాపిల్ అందుకు బదులుగా టాటా గ్రూప్ కి చెందిన ఫాక్స్ కాన్ కంపెనీకి యాపిల్ ఫోన్స్ అసెంబ్లింగ్ పనులను అప్పగించింది. దీనిపై నే డొనాల్డ్ ట్రంప్ టిమ్ కుక్ ను హెచ్చరించినట్లు మీడియాకు చెప్పారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola