Tirupparankundram Temple Issue | తిరుప్పారన్‌కుండ్రం మురుగున్ ఆలయం వివాదం ఏంటి? | ABP Desam
తమిళనాడులోని మధురై సమీపంలో ఉన్న పవిత్ర శిఖరం తిరుప్పరన్‌కుండ్రం చుట్టూ ఇప్పుడు తమిళనాడులో పెద్ద వివాదం నడుస్తోంది. ఇలాంటి టైంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఇదే వివాదంపై హిందూ సంఘాలకు సపోర్ట్‌గా సుదీర్ఘ పోస్ట్ చేయడంతో ఇప్పుడీ వివాదం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే అసలేంటీ వివాదం? తిరుప్పరంకుండ్రం కొండ చరిత్ర ఏంటి? దీనిపై హిందువులు, ముస్లింల మధ్య ఎందుకు వివాదం రాజుకుంది? ఫస్ట్ అసలు వివాదం ఏంటో చూద్దాం. తిరుప్పరంకుండ్రం కొండపై మురుగన్ దేవుడి 6 పవిత్ర క్షేత్రాలలో మొదటిదైన సుబ్రమణ్యస్వామి గుహాలయం ఉంది. ఇదే కొండపై హజరత్ సుల్తాన్ సికందర్ షాహీద్ దర్గా కూడా ఉంది. దీంతో ఈ కొండ రెండు మతాలకు పవిత్ర స్థలంగా మారింది. కానీ.. ఇలా రెండు మతాల పవిత్ర స్థలాలు ఉండటంతో కొండపై ఆధిపత్యం కోసం కూడా రెండు వర్గాల మధ్య వివాదం రాజుకుంది. ఇలాంటి టైంలో కొండపై స్వామివారికి దీపం పెట్టి పూజలు జరిపే ప్రాంతంలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి చెందిన ఎంపీ నవాస్ కాని బిర్యానీ తిన్నారనే ఆరోపణలు రావడంతో ఒక్కసారిగా హిందువులు భగ్గుమన్నారు. దానికి తోడు ఈ భోజనాన్ని పోలీసులు కొండపైకి అనుమతించడాన్ని కూడా హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అన్నామలై లాంటి బీజేపీ నాయకులు ఈ చర్యను హిందూ మనోభావాలను దెబ్బతీయడానికి చేసిన చర్యగా చెప్పారు. అయితే ఈ విషయాన్ని మొదట్లో నవాజ్ ఖానీ ఖండించినా.. ఆ తర్వాత తన అనుచరులేమైనా తిన్నారేమో తనకి తెలియదంటూ కామెంట్ చేయడంతో వివాదం ఇంకా పెద్దదైంది.