
Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP Desam
సునీతా విలియమ్స్ 9నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత విజయవంతంగా భూమికి చేరుకున్నారు. ప్రస్తుతం నాసా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సునీతా విలిమయ్స్ అతి త్వరలో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటారు. సునీత సాధించిన విజయంపై భారత్ లో సంబరాలను నిర్వహించారు. ప్రధానంగా భారత్ లో నివసించే సునీత విలియమ్స్ బంధువుల ఆనందానికైతే అవధుల్లేవు. సునీతతో చిన్నతనం నుంచి గడుపుతున్న ఆమె అన్న వరుసయ్యే దినేష్ రావల్ ఎన్నో సంగతులు ఏబీపీతో ఎక్స్ క్లూజివ్ గా పంచుకున్నారు.
నా పేరు దినేష్ వి. రావల్. నేను సునీతా విలియమ్స్ కి అన్నయ్య అవుతాను. నేను తనతో పాటు ఇండియాలో గడిపాను..అమెరికాలోనూ సునీతాతో కలిసి ఉన్నాను. చాలా ఏళ్లుగా మేం కలిసే ఉన్నాం. మా కుటుంబానికే కాదు మొత్తం మన భారతదేశానికి, ప్రపంచానికి సునీత ఓ గర్వకారణం. మొత్తం ప్రపంచ మానవాళికి మేలు చేసేలా సునీతా విలియమ్స్ భూమికి సురక్షితంగా తిరిగి చేరుకున్నారు. ఆమె భూమిపై అడుగుపెట్టడం తెల్లవారుజామున అందరం చూశాం. ఆమె బయటకు రాగానే ఎగిరి గంతేశాం. ఇంట్లో అంతా పూలు జల్లుకున్నాం. మిఠాయిలు పంచుకున్నాం. దేవుడికి దీపం పెట్టుకుని ఆమె క్షేమంగా తిరిగి వచ్చినందుకు పూజలు చేశాం. ఎందుకంటే ఇది మా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. నిజం చెప్పాలంటే లోపల లోపల కొంచెం భయపడుతూనే ఉన్నాం. ఏదైనా మళ్లీ తేడా జరుగుతుందా.. సునీత తిరిగి భూమి మీదకు సురక్షితంగా వస్తుందా లేదా అనే భయం అయితే మమ్మల్ని వెంటాడుతూనే ఉంది. కానీ ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాం. ఆమె తిరిగి వచ్చేసింది. ఇంత పెద్ద విజయం ఇన్ని నెలలు అంతరిక్షంలో ఉన్నా ఆమె మనసులో ఇసుమంత కూడా కంగారు లేదు. కొంచెం కూడా ఆమె బాధ పడలేదు ఎప్పుడూ. ఎప్పుడైనా మేం వాళ్ల కుటుంబంతో మాట్లాడినప్పుడు ఆమె ఇదే చెప్పింది. మీరెప్పుడూ నిరాశ పడకండి. నేను కచ్చితంగా తిరిగి వస్తాను అని చెప్పేదట. ఎలాంటి పరిస్థితుల్లో నైనా అస్సలు భయపడాల్సిన అవసరం లేదని ఆమె ప్రపంచం మొత్తం చెప్పినట్లైంది.