Solar Eclipse :కానీ తెలుగు రాష్ట్రాల్లో కనిపించదు. మరి ఎవరికి కనిపిస్తుంది?
నేడే సంపూర్ణ సూర్య గ్రహణం.మనకి కనిపించదు.2021లో చివరి సూర్య గ్రహణం ఇది. డిసెంబర్ 4వ తేదీన ఏర్పడనుంది. ఈ ఏడాది చివరి సంపూర్ణ సూర్యగ్రహణం శనివారం ఏర్పడనుంది. ఉదయం 10.59 నిమిషాలకు మొదలైన గ్రహణం మధ్యాహ్నం 12.30కు సంపూర్ణమవుతుంది. మధ్యాహ్నం 1.33 నిమిషాలకు సంపూర్ణ గ్రహణం ముగుస్తుంది. అప్పట్నించి గ్రహణం వీడడం మొదలై మధ్యాహ్నం 3.07 నిమిషాలకు పూర్తిగా విడుస్తుంది. అంటే మొత్తం నాలుగ్గంటలకు పైగానే గ్రహణ సమయం వస్తోంది. ఇది సంపూర్ణ సూర్య గ్రహణం కావడంతో పలు దేశాల ప్రజలు ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.