SIR Creek Issue | సర్‌క్రీక్‌ వివాదం ఏంటి? పాకిస్తాన్‌కి రాజ్‌నాథ్ వార్నింగ్ ఎందుకిచ్చారు? | ABP Desam

ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్ధం అంటే మనందరికీ గుర్తొచ్చేది కాశ్మీర్ లేదా LOC. కానీ, గుజరాత్ దగ్గర ఒక చిన్న ఉప్పునీటి కాలువ ఉంది. దాని పేరు సర్ క్రీక్. 96 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ భారత్‌కి సైనికపరంగా, ఆర్థికంగా అండ్ భద్రతాపరంగా కాశ్మీర్‌ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ ప్లేస్. అందుకే అధికారికంగా ఈ ప్లేస్ భారత్‌దే అయినా.. దీన్ని ఎలాగైనా సొంతం చూసుకోవాలని పాకిస్తాన్ దాదాపు 70 ఏళ్లుగా ట్రై చేస్తూనే ఉంది. కానీ ఎందుకు? బురదమట్టితో నిండిపోయి ఉండే రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో ఉండే ఈ చిన్న కాలువని పాకిస్తాన్‌ ఎందుకు లాక్కోవాలనుకుంటోంది? పదండి ఈ రోజు ఇండియా మాటర్స్‌లో తెలుసుకుందాం.

సర్ క్రీక్ అనేది గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్ ఏరియా అండ్ పాకిస్తాన్‌లోని సింధ్ ప్రావిన్స్ మధ్య ఉన్న ఒక టైడల్ ఎస్ట్యూఅరీ.. అంటే ఫ్రెష్ వాటర్ సముద్రపు నీటితో కలిసే ఓ కాలువ అన్నమాట. ఇది అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ ప్రాంతం ఇంత ఇంపార్టెంట్ కావడనికి 3 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. 
1.  ఎకనామిక్ బెనిఫిట్: సర్ క్రీక్ అనేది ఆసియాలోనే అతిపెద్ద ఫిషింగ్ గ్రౌండ్స్‌లో ఒకటి. దీనిపై నియంత్రణ సాధిస్తే.. వేల కిలోమీటర్ల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్ సొంతమైపోతుంది. అంతేకాకుండా.. ఇక్కడ సముద్ర గర్భంలో ఉండే మోస్ట్ వాల్యుఅవుల్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్‌ కూడా సొతం చేసుకోవచ్చు.
2.  స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్: ఈ ప్రాంతంపై పట్టు ఉంటే... నేవీకి గుజరాత్ కోస్ట్ వద్ద స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ దొరుకుతుంది. అంటే ఈ ప్రాంతంలో నేవీ గస్తీ నిర్వహస్తూ.. పక్కదేశంపై నిఘా పెట్టొచ్చన్నమాట. 
3.  సెక్యూరిటీ: ఈ చిత్తడి నేలలు పాక్ ఆధీనంలో ఉంటే ఆ దేశం ఉగ్రవాదులని భారత్‌లోకి అక్రమంగా పంపించేందుకు బాగా ఉపయోగపడతాయి. ఇది భారత్‌కి పెద్ద వీక్‌ పాయింట్‌గా మారే డేంజర్ ఉంది. అదే సర్ క్రీక్ ప్రాంతం భారత్ ఆధీనంలో ఉంటే.. దేశంలో టెర్రరిస్ట్ ఇన్‌ఫిల్ట్రేషన్స్‌ని అడ్డుకోవడం చాలా ఈజీ అవుతుంది. 
ఇంత ఇంపార్టెంట్ కాబట్టే.. ఈ ప్రాంతంపై రెండు దేశాలూ ఓనర్‌షిప్ క్లెయిమ్ చేస్తాయి. కానీ రూల్స్ ప్రకారం.. ఈ ప్రాంతం ఎవరిది?

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola