Sinkhole swallows pune truck | పూణేలో జరిగిన విచిత్రమైన ప్రమాదం | ABP Desam

Continues below advertisement

 ఈ రోడ్డు మీద ఆగి ఉన్న ట్యాంకర్ ను చూడండి రోడ్డు ఎలా మింగేసిందో. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనతో డ్రైవర్ అయితే బిత్తరపోయాడు. భూమి కుంగటం అంటే మనకు తెలుసు. కానీ ఇంత పెద్ద ట్యాంకర్ ను అమాంతం తనలోపలికి లాగేసుకునేంత రేంజ్ లో ఏర్పడింది ఇక్కడ గుంత. ఈ చిత్రమైన ప్రమాదం పుణేలో జరిగింది. పుణేలోని లక్ష్మీ రోడ్ ప్రాంతంలో శానిటేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన ట్యాంకర్ ఆ ఏరియాలో శుభ్రం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఉన్నపళంగా రోడ్డు మీద ఇంత గుంత ఏర్పడటం ఇంత భారీ ట్రక్ లో నిట్ట నిలువునా రోడ్డులో కూరుకుపోవటంతో దాన్ని ఎలా బయటకు తీయాలో తెలియక అధికారులు తలపట్టుకున్నారు. అదృష్టం ఏంటంటే ఇంత ప్రమాదం జరిగినా డ్రైవర్ రెప్పపాటులో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగలిగారు. అస్సలు ఊహించని ఈ ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకోవాలన్నా కొత్తగా ఉందంటున్నారు స్థానిక అధికారులు

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram