Singapore PM on Nehru: Democracy పై చర్చలో భాగంగా నెహ్రూపై ప్రశంసలు | PM Modi

Singapore PM Lee Hsein Loong.... India తొలి PM Pandit Jawaharlal Nehru పేరు ప్రస్తావించారు. ఆ దేశ పార్లమెంట్ లో... ప్రజాస్వామ్యంపై జరిగిన చర్చలో ఆయన నెహ్రూ ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ దేశంలో వర్కర్స్ పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై వచ్చిన ఫిర్యాదులపై అక్కడి కమిటీ ఓ నివేదిక సమర్పించింది. ఈ అంశంపై ప్రధాని లీ సైన్ లూంగ్ ప్రసంగించారు. ప్రపంచంలో చాలా దేశాలు... Ideal ఆలోచనలతో, ఉన్నత విలువలతో తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తాయని, కానీ కాల క్రమేణా ఆ పరిస్థితులు మారుతూ వస్తాయన్నారు. ఆయా దేశాల Independence కోసం పోరాడిన నాయకులు చాలా ధైర్యవంతులని, ఎన్నో నైపుణ్యాలు కలిగినవారై ఉంటారని కొనియాడారు. అందులో జవహర్ లాల్ నెహ్రూ ఒకరని సింగపూర్ ప్రధాని ప్రశంసించారు. కానీ ఏ దేశంలోనైనా సరే.... ముందు తరాలు ఇచ్చిన స్ఫూర్తిని తర్వాతి తరాలు అందుకోలేవని లీ అభిప్రాయపడ్డారు. ఇండియాను ఉదాహరణగా తీసుకుంటే... Media Reports ప్రకారం.. అక్కడి లోక్ సభ సభ్యుల్లోని సగం మందిపై Criminal Charges ఉన్నాయని లీ ప్రస్తావించారు. Singapore PM వ్యాఖ్యలపై Indian Social Media లో Tweets War మొదలైంది. PM Narendra Modi కి ఇది ఇన్ డైరెక్ట్ కౌంటర్ అని కొందరు అంటున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola