
Ideas of India 2025 | ఎలన్ మస్క్ గురించి గోయెంకాల వారసుడు ఏం చెప్పారంటే | ABP Desam
ఎలన్ మస్క్ ను విపరీతంగా ఆరాధిస్తానని అందుకు కారణాలేంటో కూడా చెప్పారు శాశ్వత్ గోయెంకా. ఆయన RPSG గ్రూపు వైస్ ఛైర్మన్ గా ఉన్నారు. దేశంలో టాప్ బిజినెస్ పర్సన్స్ లో ఒకరైన గోయెంకాల వారసుడు ఎలన్ మస్క్ ను ఎందుకు ఆరాధిస్తున్నాడంటే ఆయన మాటల్లోనే..."ఎలన్ మస్క్ ను చాలా అభిమానిస్తా. ఆయనలో బాగా నచ్చింది ఏంటంటే మస్క్ తనను తను బాగా నమ్ముతాడు. తన ఐడియాలు అన్నీ సక్సెస్ కాలేదు. పాపులర్ కాకపోయినా తన ఐడియాలను బలంగా నమ్ముతాడు కాబట్టే తను ఆ పొజిషన్ లో ఉన్నాడు. రానున్న 15ఏళ్లలో ప్రపంచంలో చాలా మార్పులు రానున్నాయి. ఎలాంటి విప్లవాత్మకమైన ఆవిష్కరణలు వస్తాయో కూడా చెప్పలేం. వస్తున్న మార్పులకు అనుగుణంగా మనం ఎప్పటికప్పుడు సిద్ధం కావాలి. అన్నింటినీ అడాప్ట్ చేసుకోగలిగితేనే మనకు మనుగడ ఉంటుంది. వచ్చే పదిహేనేళ్ల తర్వాత ఎలా ఉంటానో చెప్పలేను కానీ రిలవెంట్ గా ఉండాలని మాత్రం కోరుకుంటా."