సల్మాన్‌ను చంపితే లారెన్స్ బిష్ణోయ్‌కు వచ్చే ప్రయోజనం ఏంటి?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఇప్పుడు ముంబై పోలీసులు మరింత ఎక్కువగా దృష్టి సారించారు. ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున ముంబయిలోని సల్మాన్ ఖాన్ నివసించే గెలాక్సీ అపార్ట్ మెంట్ వద్ద సెక్యూరిటీని మరింతగా పెంచారు. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ ముంబయి నడిబొడ్డులో బహిరంగంగా హత్యకు గురైన సంగతి తెలిసిందే. తామే ఈ హత్య చేశామని లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఈయన సల్మాన్ ఖాన్ కు చాలా సన్నిహితుడు. దీంతో ఇప్పుడు సల్మాన్ భద్రత కూడా మరింత ప్రమాదంలో పడినట్లుగా చెబుతున్నారు. తమ నివాసమైన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌ను ఎవరూ సందర్శించవద్దని సల్మాన్ ఖాన్ కుటుంబం సందేశం పంపిందని కూడా పోలీసులు చెబుతున్నారు.

అయితే, సల్మాన్ ఖాన్ ప్రాణాలకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ముప్పు ఉంది. గతంలో సల్మాన్ కు వారి నుంచి హత్యా బెదిరింపులు వచ్చాయి. అసలు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఒక గ్యాంగ్ స్టర్. 31 ఏళ్ల ఇతనిపై హత్యలు, దోపిడీలకి సంబంధించి రెండు డజన్లకు పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఇతని గ్యాంగ్ దాదాపు 700 మందికి పైగా షూటర్లతో సంబంధాలు కలిగి ఉంది. ఈ గ్యాంగ్‌స్టర్ ఎప్పుడు, ఎవరిని చంపేస్తారో అన్న భయం అటు రాజకీయ నేతల్లోనూ, ఇటు స్టార్ సెలెబ్రెటీల్లోనూ కనిపిస్తోందనే చర్చ మొదలైంది. Maharashtra Control of Organised Crime Act చట్టంలో 2023 ఆగస్టులో అరెస్టైన బిష్ణోయ్.. ప్రస్తుతం గుజరాత్ లోని సబర్మతి జైల్లో ఉన్నాడు. అక్కడినుంచే తన నేర సామ్రాజ్యన్ని నడిపిస్తున్నాడని ప్రచారం ఉంది.

అయితే, ఇతని నుంచి సల్మాన్ ఖాన్‌కు ఎందుకు ముప్పు ఉంది. గతంలో లెక్కలేనన్ని సార్లు సల్మాన్ పై హత్య ప్రయత్నాలు కూడా జరిగాయి. ఇందుకు మూలం సల్మాన్ ఖాన్‌పై ఉన్న క్రిష్ణ జింకలను వేటాడిన కేసు అని చెబుతారు. 1998లో Hum Saath Saath Hain సినిమా షూటింగ్ కోసం రాజస్థాన్‌లోని ఓ గ్రామానికి వెళ్లినప్పుడు కృష్ణ జింకలను వేటాడి రెండిటిని చంపారనే ఆరోపణలు వచ్చాయి. ఆ జింకలను వేటాడడం చట్టవిరుద్ధం. క్రిష్ణ జింకలు తమ స్పిరిచువల్ లీడర్‌ పునర్జన్మగా భావించే Bishnoi community సల్మాన్‌పై కేసు వేసింది. అప్పట్లో అది చాలా సంచలనం కాగా.. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో కోర్టు నిర్ధోషిగా తేల్చింది. అందువల్లే సల్మాన్ ఖాన్‌ను చంపాలని లారెన్స్ బిష్ణోయ్ నిర్ణయించుకున్నాడని అంటారు. సల్మాన్ ఖాన్‌కు ఎవరు సహకరించినా వదిలిపెట్టబోనని.. బాబా సిద్దిఖీని చంపిన అనంతరం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. ఆ క్రమంలోనే బాబా సిద్దిఖీని చంపినట్లుగా ఓ ప్రకటన విడుదల చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola