S jayashankar Counter to G7 Countries | భారత్ సంయమనం పాటించాలన్న జీ7 దేశాలకు జైశంకర్ కౌంటర్ | ABP Desam

 పాక్, భారత్ రెండు దేశాలు యుద్ధం వైపు వెళ్లకుండా సంయమనం పాటించాలంటూ జీ7 దేశాల విదేశాంగ మంత్రులు రాసిన లేఖపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ ఫైర్ అయ్యారు. యూకే, జపాన్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, ఇటలీ, అమెరికా దేశాలతో యూరోపియన్ యూనియన్ రిప్రజెంటేటివ్  తరపునఈ లేఖ విడుదల కాగా దానికి జై శంకర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు. వెస్ట్రన్ కంట్రీస్ అన్నీ కూడగట్టుకుని పాకిస్థాన్ కి IMF తో డబ్బులు ఇప్పిస్తాం...భారత్ ను సైలెంట్ గా కూర్చోమందాం..అని అనుకుంటే ఆ రోజులు పోయాయన్నారు జైశంకర్. ఇది కొత్త భారతం అన్న జైశంకర్...మా ప్రజల ప్రాణాలు ఆపదలో ఉన్నప్పుడు ఎవరూ ఏ దేశం ఏ శక్తి తమకు ఆపలేదన్నారు జైశంకర్.  అలా అని భారత్ ని తక్కువ అంచనా వేస్తే ఎవ్వరినీ పట్టించుకోవాల్సిన అవసరం కూడా తమకు లేదన్నారు మంత్రి జై శంకర్. ఇదే విషయమై ఆయన ట్వీట్ కూడా చేశారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola