Reschedule NEET PG Exam 2022|నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసింది గా కోరిన ఐఎంఏ| ABP Desam
మే 21న జరగాల్సిన నీట్ 2022 పీజీ పరీక్షను రీషెడ్యూల్ చేయవలిసిందిగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియాను కోరింది. నీట్ పీజీ 2021కి సంబంధించిన ఆల్ ఇండియా కోటా (ఏఐక్యూ) కౌన్సెలింగ్‌లో జరిగిన ఆలస్యాన్ని ఈ సందర్భంగా హైలైట్ చేసింది. 2021 కౌన్సెలింగ్ పూర్తి కావడానికి, NEET PG 2022 పరీక్ష తేదీ మధ్య సమయం చాలా తక్కువగా ఉందని అలాంటి కష్టమైన పరీక్ష కోసం ప్రిపేర్ అవటానికి సమయం ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఉత్తరం రాసింది.