Rahul Gandhi on PM Modi | లోక్ సభలో తనను మాట్లాడనివ్వకపోవటంపై రాహుల్ ఫైర్ | ABP Desam

ప్రధాని మోదీపై భయంకరమైన ఒత్తిడి ఉందని లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో తనను మాట్లాడనివ్వకపోవటంపై మండిపడిన రాహుల్ గాంధీ...మోదీ ఎందుకు ఒత్తిడిలో ఉన్నారో వివరించారు. 

"నేను మూడు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మొదటిదే చెప్పనివ్వట్లేదు. మోదీజీ భయపడ్డారు. అమెరికా ట్రేడ్ డీల్ నాలుగు నెలల నుంచి అలాగే ఉంది. ఒక్క రిప్లై ఇవ్వలేదు. నాకు తెలిసిందే మోదీకి తెలియదు. నిన్న సాయంత్రం మోదీ ట్రేడ్ డీల్ పై సంతకం పెట్టారు. మోదీపైన భయంకరమైన ఒత్తిడి ఉంది. ఆయనకున్న ఇమేజ్ కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసుకువచ్చింది. అదంతా కుప్పకూలిపోతుంది.

సమస్య నరవణే స్టేట్మెంట్ పై గురించి నేను చేసిన వ్యాఖ్యల గురించి కాదు. అది సైడ్ షో మాత్రమే. అది మోదీజీకి తెలుసు నాకూ తెలుసు. మోదీజీ తలొగ్గారు. ఎవరు చేశారు ఎవరు చేయించారో దేశ ప్రజలు ఆలోచించాలి. చరిత్రలో తొలిసారిగా లోక్ సభలో విపక్షనేతను మాట్లాడనివ్వలేదు. దేశంలో ఉన్న రైతులంతా ఆలోచించాలి. ఈ అమెరికా ట్రేడ్ డీల్ తో రైతుల రక్తం, శ్రమను మోదీజీ అమ్మేశారు. ఎందుకంటే ఆయన తలొగ్గేశారు. రైతులనే కాదు మోదీజీ దేశాన్నే అమ్మేశారు. అందుకే నన్ను సభలో మాట్లాడనివ్వట్లేదు. మోదీజీ భయపడ్డారు. ఎందుకంటే మోదీజీ ఇమేజ్ ను బిల్డ్ చేసినవాళ్లే ఇప్పుడు దాన్ని కూలదోస్తామని భయపెడుతున్నారు.

అదానీపై అమెరికాలో కేస్ ఉంది. వాళ్లు అదానీని టార్గెట్ చేయట్లేదు. నరేంద్ర మోదీ ఆర్థిక వ్యవస్థ మీద అమెరికా టార్గెట్ చేసింది. రెండోది ఎప్ స్టైన్ ఫైల్స్. ఆ ఎప్ స్టైన్ ఫైల్స్ ను విడుదల చేస్తామన్న అమెరికా చేయకుండా భయపెడుతోంది. అదానీపై అమెరికాలో ఉన్న కేసుతో మోదీని భయపెడుతున్నారు. ఎందుకంటే బీజేపీకి ప్రధాన ఆర్థిక వనరు అదానీనే కాబట్టి. ఈ కేసు మోదీపైన కూడా ఉన్నట్లే. ఇప్పుడు ఎప్ స్టైన్ ఫైల్స్. ఈ రెండు కారణాలతో మోదీపై చాలా ఒత్తిడి ఉంది." - రాహుల్ గాంధీ, లోక్ సభలో విపక్షనేత

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola