Rahul Gandhi Comments on Halwa Cermony | బడ్జెట్ ముందర చేసే హల్వాపై సభలో నవ్వుల్ నవ్వుల్ | ABP

Rahul Gandhi Comments on Halwa Cermony | బడ్టెట్ ముందర కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ హల్వా తయారు చేశారు. దీనిపై మాట్లాడుతూ సభలో రాహుల్ గాంధీ నవ్వులు పూయించారు.ఇంకా ఏమన్నారంటే.."బడ్జెట్ ముందర కేంద్ర ఆర్థిక మంత్రి హల్వా చేశారు. ఆ ఫొటోలో  ఈ ఫొటోలో ఒక్క దళిత, ఆదివాసీ, ఓబీసీ ఆఫీసర్ లేరు.  అసలేం జరుగుతోంది అధ్యక్షా..! దేశం కోసం హల్వా తయారు చేస్తుంటే 73 శాతానికిపైగా ప్రజల ప్రాతినిథ్యమే లేదు. కేవలం 20 మంది అధికారులు బడ్జెట్ తయారు చేసినట్లు మాకు తెలిసింది. 20 మంది మాత్రమే ఈ దేశ బడ్జెట్ తయారు చేశారు కావాలంటే వాళ్ల పేర్లు నా దగ్గర ఉన్నాయి. ఇవ్వమంటే మీకు ఇస్తాను. దేశం మొత్తం పంపిణీ చేయాల్సిన హల్వా బాధ్యతను కేవలం ఈ 20 మంది చేతిలో ఉంచారు. అధ్యక్షా..!  ఆ 20 మందిలోనే ఇద్దరు మాత్రమే ఇతర వర్గాల నుంచి ఉన్నారు. ఒకరు ఓబీసీ, ఇంకోకరు మైనార్టీ. ఐనప్పటికీ.. ఫొటోలో ఒక్కరు కూడా లేరు " అని రాహుల్ గాంధీ అన్నారు. 

 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola