ISRO News: 8 ఏళ్ల క్రితం నింగిలోకి ఇస్రో రాకెట్ - ఇప్పుడు భూమ్మీద పడ్డ శకలాలు

Continues below advertisement

ISRO Latest News: 2017 లో ఇస్రో (ISRO News) ఒకేసారి 104 శాటిలైట్స్‌ని అంతరిక్షంలో వివిధ ఆర్బిట్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టిన విషయం గుర్తుందా? ఆ 104 శాటిలైట్లను మోసుకెళ్లిన రాకెట్.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత భూమ్మీద పడిపోయింది. ఈ విషయాన్ని ఇస్రోనే కన్ఫామ్ చేసింది. 104 శాటిలైట్స్ ని మోసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ PSLV C3 రాకెట్ శకలాలు (ISRO PSLV C3 Parts in Atlantic Ocean) అట్లాంటిక్ మహా సముద్రంలో సురక్షితంగా కూలిపోయింది. 

2017లో ప్రయోగ సమయంలో 104 శాటిలైట్స్ ని నిర్దేశిత కక్ష్యల్లో విజయవంతంగా ఇంజెక్ట్ చేసిన తర్వాత రాకెట్ ఎగువ దశ 470x494 కిమీ కక్ష్యలో వదిలేశారు. తర్వాత ఇది భూభ్రమణం చేస్తూ గ్రావిటేషనల్ పుల్ కారణంగా భూమి వైపునకి చేరుకుంది. ఆ ప్రక్రియ అంతా ఇస్రో నిశితంగా పరిశీలించింది. అటు యూఎస్ స్పేస్ కమాండ్ కూడా ఊహించినట్లుగానే PSLV C3 శకలాలు అక్టోబర్ 6, 2024న నార్త్ అట్లాంటిక్ మహాసముద్రంలో పడ్డాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram