ప్రైవేటీక‌ర‌ణ వ‌ల‌న వినియోగ‌దారుల‌కు తీర‌ని న‌ష్టమంటున్న బ్యాంకర్లు

ఎపీలో బ్యాంకు ఉద్యోగులు రెండు రోజుల స‌మ్మెకు దిగారు.దీంతో బ్యాంకు కార్య‌క‌లాపాలు అన్ని క్లోజ్ అయ్యాయి..బ్యాంకు ప్రైవేటీర‌ణ కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న ఉదృతం చేస్తామ‌ని ఉద్యోగులు స్ప‌ష్టం చేశారు.కేంద్రం తీసుకునే నిర్ణ‌యం ప‌ట్ల బ్యాంకు ఉద్యోగులు ఆందోళ‌న దిగారు.బ్యాంకులు ప్రైవేటీక‌ర‌ణ వ‌ల‌న వినియోగ‌దారుల‌కు తీర‌ని న‌ష్టం క‌లుగుతుంద‌ని ఈ అంశం పై కేంద్రం త‌న నిర్ణ‌యాన్ని ఉప‌సంహ‌రించుకొని ప‌క్షంలో రైతులు త‌ల‌పెట్టిన ఆందోళ‌న త‌ర‌హాలోనే తాము కూడ ఉదృతంగా పోరాటం సాగిస్తామ‌ని హెచ్చ‌రిస్తున్నారు.బ్యాంకుల ప్రైవ‌టీక‌ర‌ణ వెనుక కేంద్రం కుట్ర‌తో వ్య‌వ‌హ‌రిస్తుద‌నే అనుమానం వ్యక్తం అవుతుంద‌ని తెలిపారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola