PM Modi World Yoga Day in Srinagar | జమ్ము కశ్మీర్ లో ప్రపంచ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ | ABP
జమ్ముకశ్మీర్‌లో జరిగిన యోగ దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు.దేశవ్యాప్తంగా అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సారి ప్రధాని నరేంద్ర మోదీ జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జరిగిన అంతర్జాతీయ యోగ దినోత్సవంలో పాల్గొన్నారు.శ్రీనగర్‌లోని SKICC సెంటర్‌లో యోగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ప్రధాని మోదీ ఈ సెషన్‌లో పాల్గొన్నారు. అందరితో కలిసి యోగాసనాలు వేశారు. పదో అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ఇలా కశ్మీర్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.దాల్ లేక్ తీరంలో ఈ యోగ దినోత్సవం నిర్వహించారు. ఈ ఏడాది Yoga for Self and Society అనే థీమ్‌తో వేడుకలు జరిగాయి. మన ఆరోగ్యానికే కాకుండా సమాజానికి యోగ ఎంత మేలు చేస్తుందో చెప్పడమే ఈ థీమ్ ఉద్దేశం.ఇండోర్ హాల్‌లో ప్రధాని మోదీ యోగాసనాలు వేశారు. ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో హాజరు కావాల్సి ఉన్నా అక్కడ వర్షం కురుస్తుండడం వల్ల పరిమిత సంఖ్యలోనే హాజరయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ కార్యక్రమం కొనసాగింది.ఏటా ఒక్కో చోట యోగ దినోత్సవంలో పాల్గొంటున్నారు ప్రధాని మోదీ. గతేడాది న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి హెడ్‌క్వార్టర్స్‌లో వేడుకలు జరిగాయి. ఈ సారి కశ్మీర్‌లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు.అంతకు ముందు ఈ కార్యక్రమానికి వచ్చిన వాళ్లతో కాసేపు ముచ్చటించారు మోదీ. అందరి నవ్వుతూ పలకరించారు. మోదీ రాకతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా అక్కడి వాళ్లను ఉద్దేశిస్తూ ప్రసంగించారు ప్రధాని. యోగ ప్రాముఖ్యత ఏంటో వివరించారు. అందరికీ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజులుగా ఉగ్రదాడులతో వణికిపోతున్న కశ్మీర్‌లోనే మోదీ ఈ వేడుకలు చేయడం కీలకంగా మారింది.