PM Modi Work at Assam Tea Gardens | అస్సాం తేయాకు తోటల్లో ఆకులు తెంపిన ప్రధాని మోదీ | ABP Desam

 ప్రధాని నరేంద్ర మోదీ టీ తోటల్లో కూలీలతో కలిసి కాసేపు పనిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అసోంలో పర్యటించిన ప్రధాని మోదీ..దిబ్రూఘర్ లోని టీ తోటలను పరిశీలించారు. అసోం టీ బ్రాండ్ పేరుతో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న టీ తోటల్లో కూలీలతో కలియతిరిగిన మోదీ వారితో కలిసి కాసేపు పని చేశారు. తేయాకులను కోస్తూ బుట్టల్లో వేశారు. ఈ సందర్భంగా కూలీలు పాటలు పాడుతూ తమ దైనందిన జీవితం గురించి మోదీ తో కాసేపు పంచుకున్నారు. రాజకీయాల్లోకి ముందు చిన్న తనంలో ఛాయ్ వాలా గా పనిచేసిన ప్రధాని మోదీ..నాటి రోజులను గుర్తు చేసుకుంటూ మూలాల్లోకి వెళితే నేను టీ తోటల్లో పనిచేసే శ్రామికుల వర్గానికి చెందిన వ్యక్తినే అంటూ కూలీల్లో స్ఫూర్తిని నింపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు కూలీలకు అందుతున్నాయో లేదో అడిగి తెలుసుకున్న ప్రధాని మోదీ..సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీయే సర్కారు అవలంబిస్తున్న విధానాలను శ్రామికులకు వివరించి చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola