PM Modi receives US Vice President JD Vance Family | అమెరికా ఉపాధ్యక్షుడికి సాదర స్వాగతం పలికిన ప్రధాని మోదీ | ABP Desam

 అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ అధికారిక హోదాలో తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. ఆయనకు, ఆయన భార్య, తెలుగు మూలాలున్న ఉషా చిలుకూరికి, వాళ్ల పిల్లలకు ప్రధాని మోదీ తన నివాసంలోకి ఆత్మీయ స్వాగతం పలికారు. జేడీ వ్యాన్స్ ను కారు వద్దకు వెళ్లి పలకరించి మోదీ ఆయన్ను హత్తుకుని భారత దేశం స్వాగతం పలుకుతోందని చెప్పారు. జేడీ వ్యాన్స్ కూడా నమస్తే మీరు ఎలా ఉన్నారు పలకరిస్తూ మోదీని హత్తుకున్నారు. తర్వాత జేడీ వ్యాన్స్ తన భార్య తెలుగు మూలాలున్న మహిళ అని ఉషా చిలుకూరిని పరిచయం చేస్తే..మాకు తెలియకపోవటం ఏంటీ అన్నట్లు నవ్వుతూ మోదీ పలకరించారు. జేడీ వ్యాన్స్ పిల్లలు ముగ్గురిని ముద్దు చేసిన మోదీ వాళ్లందిరనీ ప్రధాని నివాసంలోకి ఆహ్వానించి..ముందు గార్డెన్ లోకి తీసుకువెళ్లారు. అక్కడ ఉన్న నెమళ్లను..పక్షులు ఆహారం తినే ప్రదేశాలను ఆ చిన్నారులకు చూపించారు మోదీ. అంతే వాళ్లు తమ తండ్రి జేడీ వ్యాన్స్ చేయి వదిలేసి మోదీ చేయి పట్టుకునే తిరిగారు. ఆ తర్వాత తన నివాసంలో జేడీ వ్యాన్స్ తో భేటీ అయిన మోదీ పలు అంశాలపై చర్చించారు. చిన్నారులకు నెమలి ఫించాలను అందించి వాటితో రాసుకోవచ్చను కూడా చెప్పటంతో ఆ పిల్లలు ముగ్గురు ఆశ్చర్యంగా చూశారు. పిల్లలను తన ఒడిలో కూర్చోపెట్టుకుని ఓ తాత తరహాలో లాలనగా ముద్దు చేశారు మోదీ. ఓ రకంగా మోదీ వాళ్ల తాతే అనుకోవాలి. ఉషా చిలుకూరి తెలుగువారు కాగా అమెరికాలో స్థిరపడ్డారు. ఆరకంగా జేడీ వ్యాన్స్ భారత్ కు అల్లుడు అవుతారని. మరి దేశానికి పెద్ద మనిషైన మోదీ ఆ పిల్లలకు తాతే అవుతారంటూ ప్రధానమంత్రి కార్యాలయం పోస్ట్  మోదీ  ఈ వీడియో కింద అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola