PM Modi Key Decision High Level Committee | హైలెవెల్ కమిటీలో భారత్ కీలక నిర్ణయం | ABP Desam

Continues below advertisement

ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమపై యుద్ధాన్ని ఆపాలని పాక్ అధికారులు కాళ్ల బేరానికి వచ్చిన సందర్భంగా త్రివిధ దళాల అధినేతలతో హైలెవెల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించిన మోదీ..పాక్ పై తదుపరి చర్యల మీద చర్చించారు. అయితే చర్చల అనంతరం యుద్ధం దిశగా ఆలోచనలు విరమించుకోవాలనే దశవైపు భారత్ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ఏఎన్ఐ, పీటీఐ న్యూస్ ఏజెన్సీలకు సమాచారం అందింది. కానీ దీనికి ఓ షరతు ఉంది. ఇకపై ఈ క్షణం నుంచి భారత్ లో ఎలాంటి ఉగ్రవాద చర్య దేశంలో ఎక్కడ జరిగినా సరే..అది యుద్ధం కిందనే పరిగణించాలని సంచలన నిర్ణయం తీసుకుంది భారత్. ఎంత వేగంగా నిర్ణయం తీసుకోవాలంటే ఆ ఉగ్రవాద చర్యకు కారణమైన దేశాన్ని శత్రుదేశంగా భావిస్తూ..ఆదేశం భారత్ పై యుద్ధానికి దిగినట్లే భావించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. పాక్ కాళ్లబేరానికి రావటం...మీరు దాడులు చేయమని హామీ ఇస్తే మేమూ ఆపేస్తామని చెప్పటం...అమెరికా మధ్యవర్తిత్వంతో యుద్ధం ఆలోచనలు విరమించుకోవాలనే  దిశగా భారత్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా పాక్ నెత్తిపై బండ రాయి పెట్టడమే. ఇప్పుడు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద చర్య భారత్ లో ఏది జరిగినా అది పాకిస్థాన్ పై యుద్ధంగానే భారత్ భావిస్తుంది కాబట్టి చచ్చినట్లు టెర్రరిస్టులను పాకిస్థాన్ కంట్రోల్ చేసుకోవాల్సిందే. లేదంటే ఈ సారి భారత్ కొట్టే దెబ్బకు ఇక పాక్ కోలుకోవటం అనేదే ఉండదు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola