People Digging Asirgarh Fort Chhaava Viral Video | సినిమాలో చూపించినట్లు గుప్త నిధులున్నాయనే ఆశతో | ABP Desam
చత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందిన చావా సినిమా తెలుగులోనూ విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతోంది. "చావా" సినిమాలో మొఘల్ చక్రవర్తుల నిధి ఉన్నట్టు చూపించిన ఒక కోట దగ్గర ఇప్పుడు ఇవిగో ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఔరంగజేబు ఎంతో ఇష్టపడి అభివృద్ధి చేసిన నగరమైన మధ్య ప్రదేశ్ లోని బుర్హంపూర్ నగరంలో చారిత్రక కోటలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రధానంగా ఆసిఘడ్ కోటలో దక్కన్ నుండి కొల్లగొట్టిన ధనాన్ని ఔరంగజేబు సైన్యాలు దాచి ఉంచినట్టు దానిపై శంబాజీ దాడి చేసినట్టు చావా సినిమాలో చూపించారు. ఈ లోగా ఆశీఘడ్ కోట సమీపంలోనే అవి ఇప్పటికీ ఉన్నాయనే పుకార్లు లేచాయి. అంతే కోట చుట్టుపక్కల ప్రాంతాల్లోని పొలాల్లో బంగారు నాణేల కోసం ప్రజలు రాత్రి పగలు తేడా లేకుండా ఇదిగో ఇలా తవ్వేస్తున్నారు. లైట్లు మెటల్ డిటెక్టర్లు పట్టుకుని మరీ ఆ పాడు బడిన కోట చుట్టూ ప్రజలు తవ్వేస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.