విజయ్ పైన కూడా ఏసేశారుగా! తలపతికి పవన్ చురకలు
కోలీవుడ్ టాప్ హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ మీద ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఎక్స్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. నటుడు విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు అని చెప్పారు. కానీ, ఆ పోస్ట్ లోనే కాస్త చురకలు అంటించేలా మాట కూడా వాడారు. ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్‌కు నా హృదయపూర్వక అభినందనలు అని పవన్ ట్వీట్ చేశారు. విజయ్ పొలిటికల్ పార్టీ అయిన తమిళగ వెట్రి కళగం తొలి బహిరంగ వేదికపై.. విజయ్ మాట్లాడుతూ.. తాము ద్రవిడ, తమిళ జాతీయవాద ఐడియాలజీలనే ఫాలో అవుతామని.. ఇవి తమిళ గడ్డకు రెండు కళ్లులాంటివని అన్నారు. లౌకిక, సామాజిక న్యాయ సిద్ధాంతాలే తమ భావజాలమని అన్నారు. సాధారణంగా ద్రవిడ సిద్ధాంతాలు సనాతన ధర్మానికి వ్యతిరేకం. పైగా Joseph Vijay కూడా మరో మతానికి చెందిన వారు. ఇటు పవన్ కల్యాణ్ సంపూర్ణంగా సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవలే తిరుమల లడ్డూ విషయంలో ఆయన సనాతన ధర్మాన్ని నొక్కి చెప్పిన తీరు బాగా హైలైట్ అయింది. సనాతన ధర్మంపై తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ను కూడా టార్గెట్ చేశారు. అలాంటిది.. పవన్ కల్యాణ్ విజయ్ కి అభినందనలు తెలిపిన తీరు చర్చనీయాంశం అవుతోంది. ఎంతోమంది సాధువులు, సిద్ధులకు నెలవైన తమిళనాడులో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన విజయ్.. అని పేర్కొనడం విజయ్ పరోక్షంగా చురకలు అంటించడమే అనే చర్చ జరుగుతోంది.