Odisha: ఏనుగును రక్షించేందుకు వెళ్లిన టీమ్.. విలేకరి మృతితో విషాదం

ఒడిశాలోని మహానదిలో పదిహేడు ఏనుగులతో కూడిన గుంపు ఆ ప్రాంతంలో నదిని దాటేందుకు ప్రయత్నించింది. అందులో ఎనిమిది నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాయి. రెండు మాత్రం వరద ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయాయి. తొమ్మిది ఏనుగురు వరదను చూసి వెనుదిరిగాయి. ఒక ఏనుగు మాత్రం నది మధ్యలో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న ఒడిశా డిజాస్టార్ ర్యాపిడ్  యాక్షన్ ఫోర్స్ ఆ ఏనుగును కాపాడేందుకు వెళ్లాయి. యాక్షన్ ఫోర్స్ సభ్యులు ఒక బోటులో తమతో స్థానిక విలేకరులు అరిందమ్ దాస్, ప్రభాత్ సిన్హాను తీసుకెళ్లారు. బోటు కటక్ జిల్లాలోని ముండలి వంతెన సమీపంలో వరద ప్రవాహానికి బోల్తాపడింది. ఈ ఘటనలో అరిందమ్ దాస్ మరణించగా, ప్రభాత్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు కటక్ లోని గవర్నమెంట్ ఆసుపత్రి ప్రతినిధికి సమాచారం అందింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola