No Backing Down On Agnipath: అగ్నిపథ్ స్కీమ్ విషయంలో తగ్గేదే లేదంటున్న ఆర్మీ అధికారులు | ABP Desam

అగ్నిపథ్ పై ప్రజల్లో ఉన్న అనుమానాలు తొలగించేందుకు త్రివిధ దళాల ఉన్నతాధికారులు ప్రత్యేక మీడియా సమావేశం నిర్వహించారు. సైనిక వ్యవహారాల అదనపు సెక్రటరీ, లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పూరీ ఈ సందర్భంగా కీలక వివరాలు వెల్లడించారు. ప్రస్తతుం అగ్నిపథ్ లో భాగంగా 46 వేల మందిని తీసుకుంటున్నామని, త్వరలోనే ఈ సంఖ్య 1.25 లక్షలకు చేరుతుందన్నారు. ప్రస్తుతం పైలెట్ ప్రాజెక్టులా చేపట్టామని, పూర్తిస్థాయిలో పరిశీలించాక క్రమంగా విస్తరిస్తామన్నారు. డిసెంబర్ నాటికి అగ్నివీరుల తొలి బ్యాచ్ సిద్ధమవుతుందన్నారు. అగ్నిపథ్ లో ఎంపికైనవారు... ఇటీవల జరిగిన అల్లర్లలో పాల్గొనలేదని డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని తేల్చిచెప్పారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola