
Netaji Subhash Chandra Bose Fiat Car | రాంచీలో పెట్టిన ఈ ఫియట్ కారు చరిత్ర తెలుసా | ABP Desam
రాంచీలోని ఛటర్జీ కుటుంబం ప్రదర్శనకు పెట్టిన ఈ... ఫియట్ 514 కారును 1932లో డాక్టర్ ఫణీంద్ర నాథ్ ఛటర్జీ కొనుగోలు చేసారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రయాణించిన ఈ కారును ఆ కుటుంబ సభ్యులు ఎంతో విలువైనదిగా భావిస్తారు. నేతాజీ మరియు ఫణీంద్రనాధ్ 1940లో చక్రధర్‌పూర్ నుంచి రాంచీ, రామ్‌గఢ్‌లకు ఒకే కారులో ప్రయాణించారని ఫణీంద్ర మనవడు అరూప్ ఛటర్జీ తెలిపారు. మా తాత డాక్టర్ ఫణీంద్ర నాథ్ ఛటర్జీ ,డాక్టర్ యదుగోపాల్ ముఖర్జీలు చాలా మంచి స్నేహితులు. అందుకే మా తాతయ్యకు కూడా తెలుసు 1940, మార్చి 18, 19 మరియు 20 తేదీల్లో నేతాజీ రాంచీలో జరిగిన కాంగ్రెస్ సమావేశానికి హాజరు అవనున్నారని. నేతాజీ రైలులో చక్రధర్‌పూర్‌కు వచ్చారు, ఆపై మా తాత మరియు డాక్టర్ ముఖర్జీ ఈ కారులో నేతాజీని తీసుకురావడానికి వెళ్లారు... మార్చి 20న ఆయన రామ్‌గఢ్‌కు వెళ్లారు. ఈ కారులో ఒక సమావేశంలో ప్రసంగించారు... నేతాజీతో ఉన్న గౌరవాన్ని మాటల్లో చెప్పలేం..
ఇది పాతకాలం నాటిది మరియు చాలా విలువైనది. మేము దానిని మా గ్యారేజీలో ప్రదర్శించడం. చాలా సవాలుగా మారింది.