నడి సంద్రంలో ఇద్దరే మహిళలు, భూగోళాన్ని చుట్టే్సే అద్భుత యాత్ర

Continues below advertisement

ఇండియన్ నేవీ మహిళా అధికారులు ఇద్దరు సముద్ర మార్గం ద్వారా భూగోళాన్ని చుట్టి వచ్చే కార్యక్రమంలో కీలక అప్ డేట్ వచ్చింది. నావికా సాగర్ పరిక్రమ II అనే పేరుతో ఇద్దరు నేవీ మహిళా ఆఫీసర్లు INSV Tarini నౌక ద్వారా యాత్ర చేపడుతున్నారు. గత అక్టోబర్ 2న గోవా నావల్ ఓషన్ సెయిలింగ్ నోడ్ INS మండోవి నుండి వీరి గ్లోబల్ యాత్ర ప్రారంభం అయింది. అలా 8 నెలలు వీరి భూగోళాన్ని చుట్టేసే యాత్ర కొనసాగనుంది. తాజాగా వీరు ఆస్ట్రేలియాలోని ఫ్రీమాంటిల్ వరకు తమ మొదటి లెవల్ ను పూర్తి చేశారని ఇండియన్ నేవీ వెల్లడించింది. ఈ ఇద్దరు మహిళా అధికారులకు సంబంధించిన వీడియో అప్‌డేట్‌ను విడుదల చేశారు. వీరు ఫేస్ 1లో Goa నుంచి Fremantle, Australia.. అక్కడి నుంచి New Zealandలోని Lyttelton.. తర్వాత  Falkland Islands లోని Port Stanley... అక్కడి నుంచి South Africa లోని Cape Town కి వెళ్లనున్నారు. అలా మొత్తం భూమిని చుట్టేయనున్నారు. కేప్ టౌన్ నుంచి మళ్లీ గోవాకు తిరుగు ప్రయాణం కానున్నారు. ఈ యాత్రను మహిళా సాధికారత, లింగ సమానత్వం, ఇండియన్ నేవీలో మహిళలకు ఉన్న పాత్ర వంటివి చాటే ఉద్దేశంతో చేపడుతున్నారు. India's maritime heritage and traditions ని ప్రోత్సహించే ఉద్దేశం కూడా ఇందులో ఉంది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram