Mumbai Muscial Road | ముంబైలో ఏర్పాటు చేసిన ఈ రోడ్డు సంగీతం పాడుతుంది | ABP Desam

Continues below advertisement

 ఈ రోడ్డుపై ప్రయాణిస్తే చాలు..ఓసారి ఈ సౌండ్ వినిపిస్తుంది. సరిగ్గా వినండి..ఈ సౌండ్స్ ఎక్కడో విన్నట్లుగా ఉంది కదా. ఎస్ మీరు వింటున్నది జయహో పాట. ఈ మ్యూజిక్ ఎక్కడ నుంచి వస్తుందంటే ఈ రోడ్డుపై ప్రయాణిస్తే చాలు..అదే వస్తుంది. ముంబైలో దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ ను ఏర్పాటు చేశారు. ధర్మవీర్ ఛత్రపతి శంభాజీ మహారాజ్ మార్గ్ అని పిలిచే ఈ తీర ప్రాంతపు రహదారిపై 500 మీటర్ల పొడవున ఈ మ్యూజికల్ రోడ్ ఉండేలా డిజైన్ చేశారు. నారిమన్ పాయింట్ నుంచి వర్లీ కి వెళ్లే మార్గంలో ఈ రోడ్ ను 2026 ఫిబ్రవరి 11న ప్రారంభించారు. ఈ రోడ్ పై వెహికల్ కనీసం 60 నుంచి 80 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్తే చాలు ఇక్కడ ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ నుంచి టైర్లు వేగంగా వెళ్లటం ద్వారా జయహో గీతం వినిపించేలా ఎకో సిస్టమ్ ను డిజైన్ చేశారు. హంగేరియన్ టెక్నాలజీ ద్వారా ఇలా మ్యూజికల్ రోడ్స్ ను ఏర్పాటు చేసి సిటీలో జర్నీని మరింత ఎన్ హాన్స్ చేయాలనే ప్లాన్ లో భాగంగానే ప్రభుత్వం ఈ మ్యూజికల్ రోడ్ ను ఏర్పాటు చేసింది. ఇది దేశంలోనే తొలి మ్యూజికల్ రోడ్ గా రికార్డు నెలకొల్పింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola