Mumbai Mono Rail tension | ముంబైలో ట్రాక్ పై నిలిచిపోయి టెన్షన్ పెట్టిన మోనో రైలు | ABP Desam
ముంబైలో మోనో రైలు లో గాల్లో నిలిచిపోయి 400మంది ప్రయాణికులను కంగారు పెట్టేసింది. రెండు రోజులుగా ముంబైలో భారీ వర్షాలు కురుస్తుండగా...ప్రయాణికులు మోనో రైలును ఆశ్రయించారు. మైసూర్ కాలనీ- భక్తి పార్క్ స్టేషన్ల మధ్య ఎలివేటెడ్ కారిడార్ పై మెట్రో సడెన్ గా బ్రేక్ డౌన్ అయ్యింది. ప్రయాణికులు కిందకు దిగలేరు...ఊపిరాడని పరిస్థితుల్లో రైలులోనే ఉండలేని పరిస్థితుల్లో కంగారు పడిపోయారు. అయితే అప్రమత్తమైన బృహత్ ముంబై కార్పొరేషన్ ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి అందరినీ సురక్షితంగా కిందకు దించారు. భారీ లిఫ్ట్ క్రేన్ ల సాయంతో మెట్రో వంతెనను చేరుకుని అందరినీ జాగ్రత్తగా బయటకు తీసుకువచ్చారు. 104 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన మోనో రైలులో 109 మెట్రిక్ టన్నులు బరువు ఉండేలా ప్రయాణికులు ఎక్కడంతో ఈ సాంకేతిక సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. అయితే ఎవరికీ ఏమీ కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. తర్వాత మోనో రైళ్ల సర్వీసులను పునరుద్ధరణ చేశారు.