Mukesh Ambani Family Holy Dip Maha Kumbh 2025 | కుంభమేళాలో అంబానీల పవిత్రస్నానం | ABP Desam
దేశంలోనే అత్యంత సంపన్నులైన అంబానీ కుటుంబం మహాకుంభమేళాకు తరలివచ్చింది. ప్రయాగరాజ్ లో ని త్రివేణి సంగమం నాలుగు తరాల అంబానీలు పుణ్యస్నానాలను ఆచరించారు. ప్రత్యేక హెలికాఫ్టర్లలో ప్రయాగ్ రాజ్ కు చేరుకున్న అంబానీ ఫ్యామిలీ అక్కడి నుంచి అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య త్రివేణి సంగమం ప్రాంతానికి చేరుకున్నారు. ముకేష్ అంబానీ ఆయన తల్లి కోకిలా బెన్, ముకేశ్ అంబానీ సతీమణి నీతా అంబానీ, ముకేశ్ కొడుకులు ఆకాష్ అంబానీ అనంత్ అంబానీ, కోడళ్లు శ్లోకా అంబానీ, రాధికా అంబానీలు, ముకేశ్ మనవళ్లు పృథ్వీ అంబానీ, వేదా అంబానీ...ఇంకా ముకేశ్ అంబానీ అత్తయ్యలు, మేనత్తలు ఇలా నాలుగు తరాల పరివారమంతా కదిలివచ్చి ప్రయాగరాజ్ లోని త్రివేణి సంగమంలో పవిత్ర పుణ్య స్నానాలను ఆచరించారు. నిరంజని ఆఖారా అధిపతి స్వామి కైలాసానంద గిరిరాజ్ జీ మహరాజ్ దగ్గరుండి అంబానీ కి ఆయన కుమారులకు పవిత్ర స్నాన కార్యక్రమం, గంగాపూజా చేయించారు. పుణ్యస్నానాల తర్వాత అంబానీ కుటుంబం అక్కడే ఉన్న పరమార్థ్ నికేతన్ ఆశ్రమానికి చేరుకుని అక్కడి స్వామి చిదానంద సరస్వతీ మహారాజ్ కలిసి ఆశీర్వచనం తీసుకున్నారు. అంబానీల రాక సందర్భంగా మహాకుంభమేళాలో అత్యంత పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల ముందు ముకేశ్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా మహాకుంభమేళాకు వచ్చి పుణ్యస్నానాన్ని ఆచరించి వెళ్లారు