
Mahakumbh 2025 | 144ఏళ్లకు ఓసారి వచ్చే ముహూర్తంలో మహాకుంభమేళా | ABP Desam
ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళా ప్రారంభమైంది. ప్రయాగరాజ్ లోని త్రివేణీ సంగమం వద్ద తెల్లవారుజామునుంచే భక్తులు పవిత్ర పుణ్య నదుల సంగమంలో స్నానమాచరించటం మొదలుపెట్టారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఉదయం 7.30 గంటలు అంటే పుణ్యస్నానాలు ప్రారంభమైన మూడు గంటల సమయంలోనే 35లక్షల మంది త్రివేణి సంగమంలో స్నానమాచరించినట్లు డిజిటిల్ గా ధృవీకరించారు. పుష్యపౌర్ణమికి మొదలైన 45రోజుల తర్వాత మహాశివరాత్రికి ముగిసే మహాకుంభమేళాకు ఏకంగా 40కోట్ల మంది భక్తులు రావొచ్చని కేంద్రం ప్రభుత్వం చెబుతోంది. అందుకు తగినట్లుగా ఏర్పాట్లు చేస్తోంది. కుంభమేళా ప్రతీ మూడేళ్లకు ఓసారి జరుగుతుంది. కానీ ఈసారి జరుగుతున్నది మహాకుంభమేళా..ఇది పుష్కరకాలం అంటే 12ఏళ్లకు ఓసారి జరుగుతుంది. ఈసారి మహాకుంభమేళాకు మరోవిశిష్టత కూడా ఉంది. అదే 144ఏళ్లకు ఓసారి గ్రహాల కూటమి కలయిక. 12ఏళ్ల చొప్పున ఓసారి మహాకుంభమేళా వస్తుందని చెప్పుకున్నాం కదా అలా 12సార్లు 12ఏళ్లకో సారి వచ్చే కుంభమేళా అంటే 144 సంవత్సరాల వచ్చే ప్రత్యేకమైన మహాకుంభమేళా ఇది అని పండితులు చెబుతున్నారు. ఇంత ప్రాశస్త్యం ఇన్ని కోట్ల మంది భక్తులు వచ్చే ప్రపంచంలోనే అతిపెద్ద వేడుకకు యూపీ ప్రభుత్వం పూర్తిగా సన్నద్ధమైంది. ఈసారి కొత్తగా ఫ్లోటింగ్ పోలీస్ స్టేషన్ లను ఏర్పాటు చేసి నదిలోనే వాటిని తప్పుతూ ఎలాంటి ఇబ్బందులు ఎవ్వరికీ రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈసారి కుంభమేళాకు వస్తున్న వారిలో వీదేశీయులు కూడా అధిక సంఖ్యలో ఉంటున్నారు. భారత్ అంటే తమకెంతో ఇష్టమని హిందూ సంప్రదాయాలను...పవిత్ర నదీ సంగమం గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు విన్నామని..అందులో మహాకుంభమేళాలో పాల్గొనటాకి వచ్చామని విదేశీయులు చెబుతున్నారు.