Longest Moustache you will ever see: అయ్య బాబోయ్ ఎంత పొడుగో..! ఈ మీసాలు తాళ్లగానూ వాడుకోవచ్చు..!

చాలా ఏళ్ల క్రితం Bollywood లో వచ్చిన చిత్రం Sharaabi. అందులో Big B Amitabh Bachchan ఓ డైలాగ్ చెప్తారు. మీసాలుంటే నథూలాల్ లా ఉండాలి. లేకపోతే అసలు ఉండనేకూడదు అని. కానీ Rajasthan లోని Bikaner కు చెందిన Giridhar Vyas మీసాలు చూస్తే మాత్రండైలాగ్ అతని కోసమే రాశారు అనిపిస్తుంది. గిరిధర్ ను చూడగానే మీసాలంటే ఇలా ఉండాలి రా బాబూ అని మీరు కచ్చితంగా అనేస్తారు. అతనికి తన మీసాలపై ఎంత మక్కువ అంటే 35 ఏళ్లుగా వాటిని కట్ చేయకుండా అలా పెంచుతూనే ఉన్నారు. నిత్యం సోప్, షాంపూ, ముల్తానీ మట్టితోమీసాలను మెయింటైన్ చేస్తున్నారు. ఇప్పుడుమీసాలు సుమారు 22 అడుగుల వరకు పెరిగాయి. ఇది ఎంత పెద్దది అనేది సింపుల్ గా చెప్పాలంటే.... ఓ ఇంటి రెండో అంతస్థుపైకి ఎక్కి కిందకు వేలాడదీస్తేతాడులా పనిచేస్తుంది ఇది. Guinness Record సాధించడమే తన లక్ష్యమని గిరిధర్ వ్యాస్ చెబుతున్నాడు.  

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola