Khalistani Terrorist Threatens Attack On Ram Mandir | రామ మందిరంపై దాడికి కుట్ర | ABP Desam

ఖలిస్థానీ టెర్రరిస్ట్ గురుపత్వంత్ సింగ్ పన్నున్ అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామని వార్నింగ్ ఇచ్చాడు. రామ మందిరంతో పాటు మరి కొన్ని ఆలయాలనీ ధ్వంసం చేస్తామని హెచ్చరించాడు. నవంబర్ 16, 17వ తేదీల్లో అటాక్ చేస్తామని వీడియో విడుదల చేశాడు పన్నున్. కెనడాలోని బ్రాంప్టన్‌లో ఈ వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేశాడు. "అయోధ్య రామ మందిర పునాదులు కుదిపేస్తాం" అని హెచ్చరించాడు. హిందూ ఆలయాలపై ఖలిస్థాన్‌ దాడులకు దూరంగా ఉండాలని ఇండియన్స్‌ని బెదిరించాడు. గతంలోనూ చాలా సార్లు ఇలానే బెదిరింపులకు పాల్పడ్డాడు పన్నున్. నవంబర్ 1-9 మధ్య తేదీల్లో ఎయిర్ ఇండియా ఫ్లైట్స్‌లో ప్రయాణించే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తేల్చి చెప్పాడు. ఇండియన్ డిప్లొమాట్స్‌పైనా దాడులు చేసి అలజడి సృష్టించాలని పిలుపునిచ్చాడు. ఖలిస్థాన్‌ వేర్పాటువాదాన్ని ప్రమోట్ చేస్తున్న గురుపత్వంత్...భారత్‌కి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఇప్పటికే భారత్..పన్నున్‌ని టెర్రరిస్ట్‌గా ప్రకటించింది. UAPA యాక్ట్ కింద అరెస్ట్ వారెంట్‌లూ జారీ చేసింది. అయినా...అమెరికా, కెనడా నుంచి పెద్ద ఎత్తున ఇండియాకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. కెనడాలో ఇప్పటికే హిందూ ఆలయాలపై దాడులు పెరుగుతున్నాయి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola