Karnataka HC on Hijab: పిటిషన్ల విచారణ సందర్భంగా కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు | ABP Desam
Continues below advertisement
Hijab వివాదంపై దాఖలైన పిటిషన్‌పై Karnataka హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. జస్టిస్ క్రృష్ణ దీక్షిత్ ధర్మాసనం ఈ వ్యవహారాన్ని విస్తృత రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేసింది. హిజాబ్ ధరించి కళాశాలలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ దాఖలైన ఈ పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. విస్తృత ధర్మాసనమే ఈ ఉత్తర్వులపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎవరి భావోద్వేగాలను లెక్కలోకి తీసుకోబోమని, తమకు రాజ్యాంగమే భగవద్గీత అని, దాని ప్రకారమే నడుచుకుంటామని స్పష్టం చేసింది.
Continues below advertisement