కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్
Jammu & Kashmir Snow mountains Drone Visuals: జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లలో మంచు విపరీతంగా కురుస్తోంది. కశ్మీర్‌లోనూ పర్వత ప్రాంతాల్లో మంచు పెరిగి కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థానం కంటే కిందకు పడిపోయాయి. సోమవారం రాత్రి శ్రీనగర్‌లో -6.6 డిగ్రీల సెల్సియస్, గుల్‌మార్గ్‌లో -7.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మంచు కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో 3 జాతీయ రహదారులతోపాటు 223 చోట్ల రోడ్లను మూసివేసినట్లు అధికారులు తెలిపారు. దీంతో శిమ్లాలో హోటళ్లు 70 శాతానికి పైగా నిండుగా ఉన్నాయి. పలుచోట్ల వాహనాలు జారడం వల్ల జరిగిన ప్రమాదాల్లో గత 24 గంటల్లో నలుగురు వ్యక్తులు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. తీవ్రమైన చలిగాలులు ఉంటాయని ఆరంజ్ అలర్ట్ జారీ చేశారు. పలు చోట్ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గురువారం దాకా ఈ పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది.