ISRO PSLV C61 Failed : సాంకేతిక సంస్థ నిలిచిపోయిన పీఎస్ఎల్వీసీ 61 | ABP Desam
ఇస్రోకు ఊహించని షాక్ తగిలింది. 101 వ ప్రయోగంగా శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ సెంటర్ నుంచి నింగిలోకి ఎగిసిన పి ఎస్ ఎల్ వి సి 61 గాల్లోకి లేచిన కాసేపటికి విఫలమైంది. నావిగేషన్ అండ్ కమ్యూనికేషన్ శాటిలైట్ గా ఇస్రో శాస్త్రవేత్తలు తయారు చేసిన 1696కిలోల బరువైన రీ శాట్ 1బీ శాటిలైట్ కక్ష్య లోనికి వెళ్లకుండానే సముద్రంలోకి జారిపోయింది. రెండు దశలు విజయవంతంగానే పూర్తయిన మూడో దశలో సాంకేతిక సమస్య కారణంగా.. ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకు వెళ్లలేకపోయామని.. పూర్తి వివరాలు సమగ్ర విశ్లేషణ తర్వాత వెల్లడిస్తామని ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు విచారణ జరిపిన తర్వాతే కారణాలను ప్రకటిస్తామన్నారు. వాస్తవానికి పీఎస్ఎల్వీ సీ 61 రీశాట్ ఉపగ్రహం కొత్తదేం కాదు. గతంలో వాడిన టెక్నాలజీనే కాకపోతే దానికి కొంచెం అదనపు హంగులతో అడ్వాన్స్డ్ టెక్నాలజీలో తయారు చేశారు. ఫలితంగా ఇది మరింత ప్రభావవంతంగా భూమిని అంతరిక్షం నుంచి ఫోటోలు తీయగలుగుతుంది.