Israeli Palestinian War Updates : హమాస్ పై Israel యుద్ధానికి India ఎందుకు సపోర్ట్ ? | ABP Desam
గాజా స్ట్రిప్ నుంచి హమాస్ మిలిటెంట్లు చేస్తున్న దాడులను ఇజ్రాయెల్ సైన్యం అదే స్థాయిలో తిప్పి కొడుతోంది. ఇప్పటివరకూ ప్రతిదాడుల్లో 1500మంది హమాస్ ఉగ్రవాదులు హతమైనట్లు ఇజ్రాయెల్ ఆర్మీ వెల్లడించింది. తమ దేశంపై ఈస్థాయిలో దాడులకు దిగిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహూ హెచ్చరికలు జారీ చేశారు. ఈ యుద్ధంలో భారత్ తన మద్దతును ఇజ్రాయెల్ కు ప్రకటించింది. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో దాడులు మొదలుపెట్టిన దగ్గర నుంచి పాలస్తీనా ప్రేరేపిత పనులను భారత్ వ్యతిరేకిస్తోంది. ఎందుకు భారత్ ఇజ్రాయెల్ కు మద్దతు పలికింది. మనదేశానికి ఇజ్రాయెల్ కి ఉన్న సంబంధాలేంటీ ఈ వీడియోలో చూద్దాం.