INSV Kaundinya Explained | INSV కౌండిన్య స్పెషాలిటి తెలుసా ?

Continues below advertisement

సముద్రం మీద ప్రయాణించే షిప్ అంటే ఇనుము, స్టీలు, ఇంజిన్లు ఉండాలి కదా?  కానీ ఒక్క మేకు కూడా లేకుండా, కేవలం తాళ్లతో కుట్టిన షిప్ ను మన ఇండియన్ నేవీ తయారు చేసింది. భారత నావికాదళంలో అరుదైన అద్భుతం. అదే INSV కౌండిన్య! ఇది కేవలం నౌక కాదు.. 1500 ఏళ్ల కిందటి మన పూర్వీకుల మేధస్సుకు నిదర్శనం. 

ఇక ఈ షిప్ అసలు రహస్యం దాని నిర్మాణంలో ఉంది. దీనిని టాంకాయీ పద్ధతిలో నిర్మించారు. అంటే ఈ షిప్ లో ఒక్క మేకు కూడా వాడలేదు. టేక్ చెక్కల ప్లాంక్ ను కొబ్బరి పీచుతో చేసిన తాళ్లతో ఒక బట్టను కుట్టినట్టుగా కుట్టారు. దీనికి నాచురల్ గ్లూ, నూనెలు పూసి నీరు లోపలికి రాకుండా సీల్ చేశారు. మరి ఇది విరిగిపోదా ? అన్న డౌట్ మీకు రావొచ్చు. అక్కడే ఉంది అసలు కిటుకు! అలల తాకిడికి ఈ షిప్ విరగదు.. విల్లులా వంగుతుంది. ఇది ఇప్పుడు తయారు చేసిన టెక్నాలజీ కాదు... చాలా ప్రాచీనమైనది. 

దీని డిజైన్ ని అజంతా గుహల్లో అజంతా గుహల్లోని 5వ శతాబ్దపు పెయింటింగ్స్ ఆధారంగా రూపొందించారు. నాటి కంబోడియా దేశానికి మొదటిసారిగా వెళ్లిన భారతీయ సేయులర్ కౌండిన్య పేరును దీనికి పెట్టారు. గాలి డైరెక్షన్ ను బట్టి తెరచాప అంటే సెయిల్ సహాయంతో ప్రయాణిస్తుంది. 

ప్రస్తుతం ఈ INSV కౌండిన్య గుజరాత్ నుంచి ఒమన్‌ దేశానికి ప్రయాణిస్తోంది. మన పూర్వీకులు వేల ఏళ్ల కిందట ఏ టెక్నాలజీతో ఖండాలు దాటారో ప్రపంచానికి నిరూపించడమే ఈ  షిప్ లక్ష్యం. 15 మంది sailors ఈ చారిత్రక ప్రయాణంలో భాగస్వాములయ్యారు. 

మన చరిత్రలో ఇలాంటి ఎన్నో రహస్యాలు ఉన్నాయి. INSV కౌండిన్య ఆ అద్భుత రహస్యాలను మళ్లీ మన కళ్ల ముందుకు తెచ్చింది. మరి మన పూర్వీకులు అప్పట్లోనే ఉపయోగించిన ఈ టెక్నాలజీ గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola