Indigo Flights Cancellation Controversy | ఇండిగో వివాదంపై కేంద్రం సీరియస్ | ABP Desam

Continues below advertisement

 మూడు రోజులుగా వందల కొద్దీ విమాన సర్వీసులను రద్దు చేస్తూ ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఇండిగోపై కేంద్రం కన్నెర చేసింది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ అంటూ కేంద్రాన్ని సాకుగా చూపిస్తూ పైలెట్లకు డ్యూటీలు వేయకుండా కావాలనే ప్రయాణికులను ఇబ్బందులు పెట్టేలా ఇండిగో ప్రవర్తించిందని వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలపై స్పందించిన డీజీసీఏ ముందు ఆ నిబంధనను ఎత్తేసింది. ఫలితంగా పైలెట్లకు వారం రోజుల విశ్రాంతి తప్పనిసరి ఆంక్షలు ఇకపై ఉండవని డీజీసీఏ తెలిపింది. అయితే ఈ వివాదం మొత్తాన్ని పరిశీలించిన కేంద్ర పౌర విమానాయాన శాఖ..ఇది ఎవరైనా కావాలనే సృష్టించిన గందరగోళమా అనే కారణాలపై కేంద్రం దర్యాప్తు చేస్తుందన్నారు. తప్పు తేలితే ఎంతటివారినైనా కఠినంగా  శిక్షిస్తామని కేంద్రం ప్రకటించింది. అయితే శనివారం లోపు వెయ్యి విమాన సర్వీసులు రద్దు చేయటంపై ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్ క్షమాపణలు చెప్పారు. డిసెంబర్ 15 నాటికి సమస్య పూర్తిస్థాయిలో సర్దుకుపోతుందని ఆయన చెప్పినా...ప్రయాణికులు మాత్రం ఎయిర్ పోర్టుల్లో గంటల తరబడి వేచి చూస్తూ తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola