Indigo Airlines Issue | ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్న ఇండియో ఎయిర్‌లైన్స్ | ABP Desam

Continues below advertisement

విమాన ప్రయాణికులకు ఇండిగో ఎయిర్‌లైన్స్ రెండు రోజులుగా చుక్కలు చూపిస్తోంది. బుధవారం నాడు 200 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఇండిగో.. గురువారం కూడా 170 విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అంతేకాకుండా.. రేపు కూడా పెద్ద సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కానున్నాయని ముందుగానే ప్రకటించింది. ఒక్క శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచే దాదాపు 28 ల్యాండింగ్ ఫ్లైట్స్.. 27 టేకాఫ్ ఫ్లైట్స్ క్యాన్సిల్ అయినట్లు అఫీషియల్ ఇన్ఫర్మేషన్. అయితే ఇంత భారీ స్థాయిలో విమాన సర్వీసులు రద్దు కావడంతో వేల సంఖ్యలో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. అనేకమంది ఎయిర్‌పోర్టుల్లోనే పడిగాగాపులు కాయాల్సి వస్తోంది. ముఖ్యంగా శబరిమల వెళ్లాల్సిన అయ్యప్ప భక్తులు ఎయిర్‌పోర్ట్‌లోనే ఆందోళనకు దిగారు. ఇదిలా ఉంటే.. ఇంత దారుణమైన పరిస్థితులకు సాంకేతిక లోపమే కారణమని ఇండిగో చెబుతుంటే.. అసలు కారణం సిబ్బంది విషయంలో కఠినమైన రూల్స్ అమలు చేయడమేనని కొంతమంది చెబుతున్నారు. అయితే ఈ ఘటనని సీరియస్‌గా తీసుకున్న డీజీసీఏ కూడా వెంటనే దర్యాప్తు మొదలుపెట్టింది.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola