India Bullet Train : హైదరాబాద్‌ కేంద్రంగా.. మూడు బుల్లెట్ ట్రైన్ మార్గాలు

ఇండియన్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టు ( Bullet train) పై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కీలక ప్రకటన చేశారు. దేశంలోని ప్రధాన నగరాలన్నింటీని కలిపేలా హైస్పీడ్ రైలు బుల్లెట్‌లా దూసుకొస్తుందని చెప్పారు. ప్రధాన నగరాల మధ్య దూరం హైస్పీడ్ రైల్ కారిడార్‌తో తగ్గిపోతుందని... కొన్ని గంటల్లోనే ప్రధాన నగరాలను చేరుకుంటామని లోక్‌సభలో చెప్పారు. బుల్లెట్ రైలు రాకతో ముంబై పూణే మహానగాలు కలిసి పోయినట్లేనని.. కేవలం 48 నిమిషాల్లో ముంబై నుంచి పూణే చేరుకోవచ్చని చెప్పారు.  కేంద్రమంత్రి ప్రసంగంలో హైదరాబాద్ పేరు ప్రముఖంగా వచ్చింది. హైదరాబాద్‌ను మూడు ప్రధాన మార్గాలు కలుపుతున్నాయని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పూణె నుంచి రెండు గంటల్లో హైదరాబాద్‌కు వెళ్లొచ్చని... హైదరాబాద్‌ నుంచి రెండున్నర గంటల్లో బెంగళూరు.. అక్కడి నుంచి కేవలం 72 నిమషాల్లో చెన్నైకి వెళ్లిపోవచ్చన్నారు. ఇక హైదాబాద్‌ నుంచి అమరావతి మీదుగా చెన్నైకి మూడూన్నర గంటల్లో వెళ్లిపోవచ్చన్నారు. దీంతో అమరావతి మీదుగా బుల్లెట్ రైల్ వెళ్లబోతోందన్న క్లారిటీ కూడా వచ్చేసింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola