Indian Stock Market Crash | భారత్ లో కుప్పకూలిపోతున్న స్టాక్ మార్కెట్ | ABP Desam
ప్రస్తుతం ఇండియాలో చాలా విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఐదు నెలలగా స్టాక్ మార్కెట్ వరుసగా నష్టాల్లో కొనసాగుతూ వస్తుంది. గత 29 ఏళ్లలో ఇలా వరుసగా స్టాక్ మార్కెట్ పడిపోతూ రావడం అనే పరిస్థితి లేదు అంటున్నారు నిపుణులు. మార్కెట్ నిపుణులు, సెబీ చీఫ్ సైతం చాలా స్టాక్స్ ని వాటి స్థాయికి మించి అమ్ముతున్నారు అలాగే కొనుగోలు చేస్తున్నారు. ఇది ఒక గాలి బుడగ లాంటిది ఎక్కువ కాలం ఇది కొనసాగదు అని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ బబుల్ పేలడంతో స్టాక్స్ పడిపోతున్నాయి అనేది ఒక అంచనా. ఇప్పటికే చాలా స్టాక్స్ అట్టడుగు స్థాయికి చేరుకోగా ఇంకా పతనం అయ్యే ఛాన్స్ ఉంటుందనేది మరికొందరి అభిప్రాయం. స్టాక్ మార్కెట్ వైపు మధ్యతరగతి ప్రజలు సైతం ఆకర్షితులయ్యలా గత కొన్నేళ్లుగా జరుగుతున్న ప్రచారాల వల్ల విపరీతంగా కొనుగోళ్లు జరగడాలు ఇప్పుడు ప్రపంచ పరిణామాల దృష్ట్యా ఇన్వెస్టర్స్ లో భయం చేకూరడంతో ఇప్పుడు గతంలో మాదిరి కొనుగోళ్లు అమ్మకాలు ఆగిపోవడం తో స్టాక్ మార్కెట్ పతనవుతుందని అంటున్నారు.